Thursday, May 22, 2025
Homeఎడిట్ పేజిప్రజా ప్రయోజనాలు… ప్రభుత్వ విధానాలు

ప్రజా ప్రయోజనాలు… ప్రభుత్వ విధానాలు

- Advertisement -

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు కావస్తున్నా ఆర్థిక అంశాల పేరుతో అనేక సమస్యల్ని దాట వేస్తున్నది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజ నాలకు ముప్పుగా పరిణమిస్తున్నది. రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు పెండిం గ్‌లో ఉన్న డీఏలతో పాటుగా కొన్ని ఆర్థికేతర డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ మధ్య ఓ సభలో ముఖ్య మంత్రి మాట్లాడుతూ ‘నన్ను కోసినా పైసా దొరకదు. అప్పు పుట్టడం లేదు. చెప్పుల దొంగల్లా చూస్తున్నారు. ఢిల్లీ పాలకుల సహకారం ఉండటం లేదు” అని వాపోయారు. నరమాంస భక్షకులు కాదు, మను షులను కోసుకోవడానికి, పీక్కు తినడానికి. వారివేమి గొంతెమ్మ కోరికలు కావు. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను మాత్రమే వారు గుర్తుచేస్తున్నారు. కానీ వారిపట్ల తీవ్ర వ్యతిరేక భావం కలిగించే ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రికి సబబుకాదు. వారికి రావలసిన, వారు దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వడానికి కూడా సర్కార్‌కు మనసొప్పడం లేదు. ఉద్యోగులు ప్రజలకు వ్యతిరేకంగా సమరం సాగిస్తున్నారంటూ చేసిన ప్రచారం చేయడం మరీ దుర్మార్గం.
ఇదిలా ఉండగా.. కంచ గచ్చిబౌలి భూముల్లో వందెకరాలు టీజీఐఐసీకి తాకట్టుపెట్టి పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు చక్కటి పంటలు పండే పొలాలను రైతుల నుండి లాక్కొని ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ, ఇండిస్టియల్‌ కారిడార్‌ పేర కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు బెడిసి కొడుతున్నప్పటికీ చాటుగా ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రైతులను ఏదోరకంగా భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులు వారి పంట పొలాలను బలవంతంగా గుంజుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇది కాకులను కొట్టి గద్దలకు వేసే ప్రయత్నమే. పేద రైతులు, గిరిజనులు తమ ఉపాధి కోల్పోవడం రాష్ట్రానికి మంచిది కాదు, శ్రేయ స్కరం కాదు. కార్పొరేట్లకు రైతుల జీవితాలను పణంగా పెట్టడం బాధాకరం. విదేశాల్లో కూడా ఫార్మా కంపెనీలకు ఇథనాల్‌ పరిశ్రమలకు ప్రజల నుండి తీవ్ర వ్యతి రేకత వచ్చిన నేపథ్యంలో వారు అక్కడి తమ పరిశ్రమ లను మూసి వేశారు. అవి విడుదల చేసే విషతుల్య రసాయనాలు అటు ప్రజలకు, ఇటు భూములకు చాలా ప్రమా దకరం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎర్రతివాచి పరిచి కార్పొరేట్‌ కంపెనీలను ఆహ్వానిస్తూ రైతులను వారి భూముల నుండి ఖాళీ చేయించడం ప్రజల ఆరోగ్యాన్ని కూడా తాకట్టు పెట్టడమే అవుతుంది.
ఇక రాష్ట్రంలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నది. ప్రయి వేటు యాజమాన్యాల, కార్పొరేట్‌ సంస్థల దందా యథేచ్ఛగా సాగుతున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. లక్షల రూపాయల ఫీజు దోపిడీ కి అడ్డుకట్టు వేయలేకపోతున్నది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి విద్య అందని ద్రాక్ష అవుతుండగా మధ్యతరగతి వారికి కక్కలేని మింగలేని పరిస్థితి దాపురించింది. చదువుకోసం ఆస్తులు అమ్ముకో వడం లేదా తాకట్టు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రతి ఏడాది ఇరవై శాతం ఫీజులు పెరుగుతు ండటం ప్రభుత్వ అసమర్ధత కిందకే వస్తుంది. కార్పొరేట్‌ యాజమాన్యాలు రాష్ట్రంలో విద్యా రంగాన్ని శాసిస్తున్నా, వారి మీద ఏ రకమైన చర్యలకు అధికారులు ఉపక్రమించడం లేదు. ఇక్కడ కూడా సామాన్యుడి ప్రయోజనాలు ప్రయివేటుకు, కార్పొరేట్‌ పెద్దలకు తాకట్టు పెట్టార నేది నిర్వివాదాంశం. ప్రజాప్రతినిధుల్లో చాలా మందికి ప్రయివేటు పాఠశాలలు కళాశాలల్లో భాగస్వామ్యం ఉంది. వారికి సామాన్యుడి విద్య, అభివృద్ధి కంటే లాభాలు మాత్రమే ముఖ్యం. ప్రజలకు విద్యా సంస్థలపై విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభు త్వానిదే. కానీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించడం శోచనీయం.
ఆరోగ్యరంగంలోనూ ప్రయివేటు కార్పొరేట్‌ ఆసుపత్రులదే ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు లేక మందులు లేక, వసతులు, పరికరాలు లేక ప్రజలు ప్రయి వేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయి స్తున్నారు.అక్కడి వైద్య ఖర్చులకు ప్రజలు తమ ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పులు చేయడము జగమెరిగిన సత్యం. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలకు పోతున్నా అక్కడ కూడా తూతూ మంత్రమే. ప్రజలకు ప్రభుత్వ వైద్యరంగం పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. దాన్ని పునరుద్ధ రించే పని ప్రభుత్వం చేపట్టాలి. వాటిని బలో పేతం చేసి అన్ని సౌకర్యాలు సమ కూర్చి అన్నివేళలా డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అప్పుడు ప్రజలు తప్పక ప్రభుత్వ వైద్యాన్ని ఆదరిస్తారు.
ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే గత సర్కార్‌ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే బడ్జెట్‌ సరిపోతున్నదని ప్రస్తుత ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నది. కానీ, ప్రపంచ సుందరీమణుల పోటీల నిర్వాహణ చేపట్టి ఎవరూ స్పాన్సర్లు లేక కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. ఈ పోటీల వల్ల రాష్ట్రానికి గాని, దేశానికి గాని ఒరిగేదేమీ లేదు. అనవసరమైన ఖర్చు తప్ప. అనాలోచితమైన విధా నాలు, హంగులు, ఆర్భాటాలు, ఆడంబరాలు ప్రభు త్వాలకు తలవంపులు తెస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకు దిగజారుతుంటే, మార్కె ట్‌లో ఒక విష సంస్కృతిని పెంచి పోషించే ప్రపం చ సుందరీమణుల పోటీలు ఎవరి కోసం? వీటిని వ్యతిరేకిస్తూ మహిళలు, ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటాల్ని అణచివేస్తూ ఈ పోటీలు నిర్వహిం చడం అవసరమా? అసలు వీటివల్ల ఉపయోగ ముందా? నిర్వహించమని ప్రజలు కోరలేదే? ప్రజా వసరాలను తాకట్టు పెట్టి ప్రతిష్టకుపోతే రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇకనైనా పాలకులు విజ్ఞతతో ఆలోచిస్తూ, వివేకంతో పనిచేయాలి.
శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -