– 50 సార్లు ఢిల్లీతో పాటు విదేశీ టూర్లు చేసిన సీఎం : ఎన్వీ.సుభాష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీతో పాటు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో, విదేశాల్లో పర్యటించారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్ విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తెలంగాణ నుంచి నిధులను తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో 2,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, 75 శాతం ఫ్యాకల్టీ లేకుండానే నడుస్తున్నాయని ఎత్తిచూపారు. విద్యకు కేటాయిస్తామన్న 15 శాతం నిధులు ఏమయ్యాయని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అశోక్‌నగర్‌లోని విద్యార్థులకు మొహం చూపే ధైర్యం ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఉందా అని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం ప్రజల్ని మోసం చేయడమేనని విమర్శించారు.
20 నెలల పాలనలో ప్రజా సమస్యలు గాలికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES