– సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే గోవిందపురం ఎల్ గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభను మంగళవారం రాత్రి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పొన్నం వెంకటేశ్వరరావు, మోతారపు రామచంద్రయ్య స్తూపం వద్ద సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ సిపిఎం పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు నిజాం నవాబు సైన్యం జిల్లాలోనే వివిధ ప్రాంతాలలో ఏడుగురును పట్టక వచ్చి గోవిందాపురం గ్రామంలో కాల్చి చంపి ఏడుగురి ఒకే చితిపై ఫిబ్రవరి 10న దహనం చేశారన్నారు.
ఆనాటి నుంచి నేటి వరకు సిపిఎం గ్రామ శాఖల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆనాటి అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి స్ఫూర్తితో సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరంతరంగా సిపిఎం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాసిందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో దేశాన్ని విచ్చర్నం చేస్తుందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భయపడి మన దేశ ప్రజలకు ప్రధానంగా రైతులకు నష్టాలు కలిగించే ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందాల వలన మన దేశం కనుక నష్టమే తప్ప ఇటువంటి లాభం లేదన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశం ట్రంప్ కు భయపడి రష్యా నుంచి కొనుగోలు తగ్గించిందన్నారు. మన దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి నరేంద్ర మోడీ తాకట్టు పెట్టాడని విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడవలసిన పాలకులు ఆ పాలకులు ప్రయోజనాలకు విరుద్ధంగా ఒప్పందాలు చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. సాయుధ పోరాట వీరులకు కోవర్టుగా ఉంటున్నాడని గోవిందాపురం ఏలి గ్రామానికి చెందిన మోతారపు రామచంద్రయ్యను నిజాం సైన్యం అతి కిరాతకంగా హత్య చేసిందన్నారు. వీరుల స్ఫూర్తితోటే సిపిఎం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ, లక్ష్మీపురం మాజీ సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత సర్పంచ్ మంద కరుణ ఉపసర్పంచ్ కారంగుల చంద్రయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు పసుపులేటి నరేష్, సిపిఎం శాఖా కార్యదర్శులు తమ్మారపు లక్ష్మణరావు, కోట కాటయ్య, పొన్నం రాంబాబు, మహిళా శాఖ కార్యదర్శి నల్లమోతు వాణి, పార్టీ సీనియర్ నాయకులు ఏడునూతల లక్ష్మణ్ రావు, కళ్యాణపు బుచ్చయ్య, కళ్యాణపు శ్రీనివాసరావు, నల్లమోతు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కొమ్ము కమలమ్మ, పార్టీ సభ్యులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, తదితరులు పాల్గొన్నారు.



