Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో  ఫిర్యాదుదారుల నుంచి  దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం అర్జిలు మొత్తం 110 వచ్చాయి. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -