Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎర్ర జెండా పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం

ఎర్ర జెండా పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – నాంపల్లి
రాజకీయ చైతన్యం తోటే ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జూలై 25న మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరగతుల్లో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, సోషల్ మీడియా రాష్ట్ర ఇన్‌చార్జి పిట్టల రవి బోధన చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నేటి వరకూ అమలుకావడం లేదని తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరణి బదులు తీసుకువచ్చిన భూభారతి వ్యవస్థ ద్వారా రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పినా, వాస్తవానికి ఎక్కడా పరిష్కారం కాలేదన్నారు. దరఖాస్తులు చేసినా ప్రభుత్వానికి జవాబుదారిత్వం లేదని, సమస్యల పరిష్కారంపై నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిష్టరాయన్పల్లి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకు ఇప్పటికీ ఆర్ & ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలుకాలేదని, భూములు కోల్పోయిన రైతులకు ప్యాకేజీలు ఇవ్వకపోవడం ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించేదిగా ఉందన్నారు. అలాగే, అర్హులైన పేదలకు పెన్షన్లు ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా కొత్త పెన్షన్‌లు మంజూరుకాకపోవడం ఆందోళనకరమన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇప్పుడు కబ్జాకు గురవుతున్నాయని, నూతనంగా ప్రభుత్వం సేకరించిన భూమిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల  నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -