నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లు గా నూతనంగా ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి అప్పల గణేష్, ఉప సర్పంచ్ దార్ల సుసేన్, వార్డు సభ్యులు మేతరి లక్ష్మి, కచ్చకాయల లక్ష్మి, ద్యవతి పుష్పా, కొప్పెల నీతు ఆమేతరి గంగాధర్, దేవతి అరుణ్ కుమార్, పుష్కూర్ గంగ నరసయ్య, బాస బాలయ్య, రావుట్ల గంగాధర్ తదితరులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
గోవిందపేట గ్రామానికి చెందిన యువ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుల్లెట్ రమేష్ నోముల నవీన్ , గోలి దిలీప్, బండమిది అజయ్, నల్ల రాజా రెడ్డి, మేతరి నర్సయ్య సయ్యద్ పాషా, ఇంతియాజ్ , గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు..



