Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
బిచ్కుంద మండలంలోని హాస్గుల్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజా బాట కార్యక్రమంలో వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ముఖ్యంగా పోల్స్ డ్యామేజ్ వంటి ఫిర్యాదులు 15 వరకు వచ్చాయని డ్యామేజ్ అయిన పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ వేయడం జరుగుతుందని ఏఈ పవన్ కుమార్ తెలిపారు.

గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని గ్రామంలో నూతనంగా 33/11 కేవీ ఉప కేంద్రం మంజూరైనదని స్థల సేకరణ కోసం రెవెన్యూ అధికారులకు విన్నవించడం జరిగిందని భూమి అలాట్మెంట్ కాగానే త్వరలో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 33/11 కేవీ ఉపకేంద్రం నిర్మాణం వల్ల బిచ్కుంద, ఖథ్గాం సబ్ స్టేషన్ లపై లోడ్ తగ్గి షట్లూర్, హస్గుల్, మెక్కా గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు ఏర్పడిన 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఏఈ అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -