Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాబాట

విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాబాట

- Advertisement -

నవతెలంగాణ బాల్కొండ

మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో విద్యుత్ అధికారులు మంగళవారం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు. గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఏఈ కిషన్, సబ్ ఇంజనీర్ మహేష్, విద్యుత్ లైన్మెన్ లు లక్ష్మణ్, నవీన్, సంతోష్, సోమయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -