Thursday, October 16, 2025
E-PAPER
Homeబీజినెస్ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భేష్‌..

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భేష్‌..

- Advertisement -

– ఎంఎస్‌ఎంఈలకు మద్దతును పెంచాయి
– రుణాల జారీలో ప్రయివేటు బ్యాంక్‌ల కంటే మెరుగు
– ఆర్థిక సేవల కార్యదర్శి ప్రశంస
న్యూఢిల్లీ :
బ్యాంకింగ్‌ సేవలను అందించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగ్గా పని చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు అన్నారు. రుణాల వృద్ధిలో ప్రయివేటు రంగ బ్యాంక్‌ల కంటే ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు బాగా ముందంజలో ఉన్నాయని ప్రశంసించారు. రుణాల పరిశీలన, రుణ ప్రమాణాలు, ప్రాజెక్ట్‌ రుణాల పర్యవేక్షణలో పీఎస్బీలు భారీ వృద్దిని సాధించాయన్నారు. బుధవారం జలంధర్‌లోని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎంఎస్‌ఎంఈ స్పోర్ట్స్‌ క్లస్టర్‌ శాఖను నాగరాజు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ”ప్రభుత్వ బ్యాంకులు సామర్థ్యం, పారదర్శకత, విశ్వాసంపై దృష్టి సారించడం వల్ల వినియోగదారులు మళ్లీ వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. భారత ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు బ్యాంకులు మరింత మద్దతు అందించాలి.” అని నాగరాజు కోరారు. ప్రతి కస్టమర్‌ను గౌరవంతో చూస్తూ, డిజిటల్‌ సేవలు సులభంగా, స్థిరంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూడలని సూచించారు. ‘జలంధర్‌ క్రీడా పరిశ్రమ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, ఆవిష్కరణ ప్రపంచ పోటీతత్వానికి ఒక ఉదాహరణ. ఈ కొత్త శాఖలు అందరినీ కలుపుకొని, రంగాల వారీగా వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇవి ఔత్సాహికవేత్తలను బలోపేతం చేస్తాయి. ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. దేశ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుతాయి.” అని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ స్వరూప్‌ కుమార్‌ సాహా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -