- Advertisement -
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గ్రామపంచాయతీ,జడ్పిటిసి ,ఎంపిటిసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల జిల్లాలోని ప్రజలు ఫిర్యాదులను సమర్పించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -