Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే  పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 54 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. 

అందులో రెవిన్యూ శాఖ 26, పంచాయతీ శాఖ 7,ఇరిగేషన్ 5, ఎలక్ట్రిసిటీ 3, ఎంప్లాయిమెంట్ టీమ్ 3, వ్యవసాయ 2, ఈ ఈ డివిజన్ 2,మున్సిపాలిటీ 2, గ్రామీణాభివృద్ధి శాఖ 2, ఎస్సీ కార్పొరేషన్, సంక్షేమ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, జెడ్పీ సి.ఈ.ఓ శోభ రాణి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -