Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను  పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 68  అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. 

అందులో రెవిన్యూ శాఖ 56, ఎంప్లాయిమెంట్ 3, జిల్లా పంచాయతీ 2,ఇరిగేషన్ 2, ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్, జిల్లా సంక్షేమ శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధి , సర్వే ల్యాండ్  శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ మండల  స్పెషల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

 ధాన్యం కొనుగోలు కేంద్రాలను   మండల స్పెషల్ అధికారులు క్షేత్రస్థాయిలో కేంద్రాలను తనిఖీ చేసి రైతులకు ఏ  ఇబ్బంది  లేకుండాచూడాలన్నారు. కేంద్రాలలో ధాన్యం తేమశాతం వచ్చిన వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని, లారీల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం మిషన్లు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తరచూ పరిశీలించాలన్నారు. మండల ప్రత్యేక్ర అధికారులు క్షేత్రస్థాయిలో తరచూ పర్యటించాలని ఆదేశించారు.విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బడిబాట  కార్యక్రమంలో  బాగంగా మండల స్పెషల్ ఆఫీసర్స్ పాఠశాలల్లో  ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మెనూ ప్రకారం  మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ  ఇండ్ల లబ్ధిదారులకు మండల స్పెషల్ అధికారులు  సూచన చేస్తూ లబ్ధిదారులు వివిధ దశలో ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రజావాణిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి సాధ్యమైనంత వరకు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమం లో డిఆర్ఓ జయమ్మ,  డిప్యూటీ కలెక్టర్, జడ్పీ సీఈవో శోభారాణి, డిఆర్డిఏ పి.డి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ సింగ్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -