నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 57 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 35, జిల్లా గ్రామీణ అభివృద్ధి 8, ఉపాధి కల్పన 2, మున్సిపాలిటీ 2, పంచాయతీ 2, విద్య, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ,దేవాదాయ, ఆర్.టి.సి , చేనేత, నేషనల్ హైవే, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సిఈఓ శోభారాణి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



