Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజారవాణాను 70శాతానికి పెంచాలి

ప్రజారవాణాను 70శాతానికి పెంచాలి

- Advertisement -

మహాలక్ష్మి పథకం విజయవంతం
అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ స్కూల్‌
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం : విజన్‌ 2047లో భాగంగా వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

మహాలక్ష్మీ పథకం విజయవంతానికి నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌ ఇతర సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు. రవాణా శాఖ మంత్రిగా రెండేండ్లు పూర్తి చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎండీ, ఈడీలు సత్కరించారు. ఆర్టీసీని మరింత విస్కృత పర్చాలనీ, క్షేత్రస్థాయిలో రాజధాని నుంచి గ్రామాల వరకు ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించి ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపించేలా కార్యా చరణ తీసుకోవాలని ఆదేశించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్‌ భవన్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ అధికారులు రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందుకోసం ఇప్పటికే హైదరా బాద్‌ నగరంలో గత మూడు నెలలుగా సర్వే చేసి 373 కొత్త రూట్లలో బుధవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా రింగ్‌ రోడ్డు వెలుపల ఉన్న దాదాపు 7లక్షల మందికి కొత్తగా ప్రజారవాణా సౌకర్యం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రూట్లలో బస్సులు నడిపినప్పుడే విజన్‌ 2047లో మన లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పుడున్న 28శాతం ప్రజా రవాణాను 70 శాతానికి పెంచుకోవడానికి సాధ్యమవుతుందని సూచించారు.
తమకు సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయా ణికుల సౌకర్యం ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రయాణి కుల విషయంలో ఆర్టీసీ సిబ్బంది స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అటు అధికారులు సైతం ఆర్టీసీ సిబ్బంది విషయంలో కఠినంగా కాకుండా కుటుంబ సభ్యుల మాదిరి వ్యవహరించాలని అప్పుడే వారు సంస్థ కోసం మరింత పనిచేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడిచేస్తే కఠినచర్యలు తప్పవన్నారు. ఇటీవల సిరిసిల్లలో జరిగిన ఘటనలో డ్రైవర్‌కి సంస్థ అండగా ఉందన్నారు. మీ ప్రతినిధిగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాననీ, ఆర్థిక పరమైన అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని మంత్రి వివరించారు. గత పదేండ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేస, సంస్థ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ద్వారా 90కిపైగా డిపోలు లాభాల బాటలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన డిపోలు కూడా లాభాల్లోకి వచ్చేలా పని చేయాలని సూచించారు. గతంలో 2011 లో నియామకాలు జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3038 పోస్టులకు డ్రైవర్‌, శ్రామిక్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయ న్నారు. 2014 తరువాత మళ్ళీ తమ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో 2476 నూతన బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. అంటే ఇప్పుడున్న బస్సుల్లో 40శాతం ఈ రెండేండ్లు కాలంలో వచ్చినవేననీ, సంస్థలో కారుణ్య నియామకాలను బ్రెడ్‌ విన్నర్‌ స్కిం కింద 800, మెడికల్‌ అన్‌ ఫిట్‌ కింద 390 మంది మొత్తం 1190 మందిని నియమించామని తెలిపారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతనంగా పెద్దపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారంకు కొత్త డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బస్‌ స్టేషన్లను అభివద్ధి చేస్తున్నామని చెప్పారు. వచ్చే రెండేండ్ల్లల్లో నగరంలో 2800 ఈవీ బస్సులు నడుస్తున్నాయన్నారు వీడియోకాన్ఫరెన్సలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు మునిశేఖర్‌, వెంకన్న, రాజశేఖర్‌, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -