Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రజా గొంతుక నవతెలంగాణ: ఎంపీడీఓ

ప్రజా గొంతుక నవతెలంగాణ: ఎంపీడీఓ

- Advertisement -

2026 నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎంపీడీఓ క్రాంతికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు 

ప్రజా గొంతుక నవతెలంగాణ దినపత్రిక అని మండల ఎంపీడీఓ క్రాంతికుమార్ అన్నారు. శుక్రవారం నవతెలంగాణ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. మండల ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకపోతూ ప్రజా గొంతుకగా నవతెలంగాణ దినపత్రిక నిలుస్తోందన్నారు. రాబోయే కాలంలో పత్రిక మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, సర్పంచ్ లు బండి స్వామి, మేకల రాజయ్య, గడ్డం క్రాంతి, కాంగ్రెస్ నాయకుడు రాజ సమ్మయ్య ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -