– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇన్‌చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాడికీ అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీనీ నిబద్ధతతో అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన ప్రాధాన్యత తో అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ది చేకూరుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



