– నేటి రాజకీయాలు-భగత్‌సింగ్ ప్రాసంగికతపై ప్రొఫెసర్(రిటైర్డ్) చమన్‌లాల్ ప్రసంగం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతిని పురస్కరించుకుని ఈ నెల 19న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 40వ స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేటి రాజకీయాలు : భగత్‌సింగ్ ప్రాసంగికత అనే అంశంపై భగత్‌సింగ్ ఆర్కీవ్ గౌరవ సలహాదారులు, జెఎన్‌యూ రిటైర్డ్ ప్రొఫెసర్ చమన్‌లాన్ స్మారకోపన్యాసం చేయనున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్వీకే ట్రస్టు అధ్యక్షులు బీవీ.రాఘవులు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మేనేజింగ్ కమిటీ సభ్యులు జి.బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొంటారని తెలిపారు. స్మారకోపన్యాసం సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమవుతుందనీ, సభానంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు.
19న పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES