Thursday, April 9, 2026
E-PAPER
Homeజాతీయంఓటు వేయ‌డానికి బైక్ మీద వ‌చ్చిన సీఎం

ఓటు వేయ‌డానికి బైక్ మీద వ‌చ్చిన సీఎం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేర‌ళ‌, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈక్ర‌మంలో కేంద్ర‌పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగ‌స్వామి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సింపుల్‌గా బైక్ మీద పోలింగ్ బూత్‌కు వ‌చ్చి ఓటు వేశారు.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)లో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సి) 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, బీజేపీ 10 స్థానాల్లో, ఏఐఏడీఎంకే, ఎల్‌జేకే చెరో రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండ‌గా, 14 స్థానాల్లో డీఎంకే పోటీ చేస్తోంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -