Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బురదమయంగా పులిచెర్ల గ్రామం

బురదమయంగా పులిచెర్ల గ్రామం

- Advertisement -

వీధుల్లో నడవాలంటే ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు
మెయిన్ రహదారిలో మోకాలు లోతు గుంతలు
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్ల నగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి ఒకప్రత్యేకత వుంది. ఈ గ్రామం పెద్దవూర మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగల గ్రామం. మొత్తం 1187 కుటుంబాలు నివసిస్తున్నాయి. పులిచెర్ల గ్రామ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 4648 మంది ఇందులో పురుషులు 2275 కాగా స్త్రీలు 2373 మంది ఉన్నారు. ఈ గ్రామంలోవీధులు, రోడ్లు బురదమయంగా మారాయి. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు బురదమయంగా మారి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.

వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. దీనితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీంతో అటుగా వెళ్లి 20  గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.అందులో 18 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. 18 ఏళ్ల క్రితం  కింద ఈ రోడ్డును నిర్మించారు. వీధుల్లో సీసీ రోడ్లు,మురుగు కాలువలులేక బజార్లు బురద మయయంగా మారాయి.ముఖ్యంగా గ్రామం లోని మెయిన్ బజారు మోకాళ్ళ లోతులో నీళ్లు చేరి గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.రామాలయం వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో 20  గ్రామాల ప్రజలు రవాణా కష్టాలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad