Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్‌ పద్ధతి

నిమ్స్‌లో పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్‌ పద్ధతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పల్మనరీ హైపర్‌టెన్షన్‌ చికిత్సలో నిమ్స్‌ కార్డియాలజీ విభాగం మరో మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లోని కార్డియాలజీ విభాగం అరుదైన వైద్య విజయం సాధించింది. ఈ విభాగం వైద్యులు తొలిసారిగా 30 ఏళ్ల వయసున్న చెన్నైకు చెందిన పాథాలజిస్ట్‌ మహిళపై దేశంలో అత్యాధునికమైన పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్‌ పద్ధతిని విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను నిమ్స్‌ కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డా. ఎన్‌. రామ కుమారి నాయకత్వంలో బృంద సభ్యులు డాక్టర్‌ నూషా డొడ్డి, డాక్టర్‌ ఉమాదేవి కరూరు, డాక్టర్‌ అజేయ కశ్యప్‌, డాక్టర్‌ మౌనిక మెల్లంపుట్టి, డాక్టర్‌ పి. వినయ్ కుమార్‌, డాక్టర్‌ కె.భారత్‌ రెడ్డి, డాక్టర్‌ నరేష్‌ నాయుడు, డాక్టర్‌ పి.చంద్రకాంత్‌ లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. ఈ విధానం హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు ఒక ”బ్రిడ్జ్‌ టు ట్రాన్స్‌ప్లాంట్‌”గా ఉపయోగపడుతుంది.

తద్వారా తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌ ఉన్న రోగులకు కొత్త ఆశ కల్పిస్తోంది. పల్మనరీ ఆర్టరీ డెనర్వేషన్‌ అనేది ఒక క్యాథెటర్‌ ఆధారిత నూతన వైద్య పద్ధతి. ఇది మొదటగా అమెరికాలోని మాయో క్లినిక్‌లో అభివృద్ధి చేయబడింది. ఇది పల్మనరీ వాస్క్యులర్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించడం ద్వారా హీమోడైనమిక్స్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యంగా సాధారణ ఔషధ చికిత్సలకు స్పందించని తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌ రోగులకు ఉపయోగపడుతుంది. నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నగరి బీరప్ప మాట్లాడుతూ, పీఏడీఎన్‌ శస్త్రచికిత్స తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా నిమ్స్‌లో విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. దేశంలో ఇది ఆరో కేసుగా నమోదైనట్టు చెప్పారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -