నవతెలంగాణ – హైదరాబాద్: కెనడా రాజకీయ చరిత్రలో 2025 ఫెడరల్ ఎన్నికలు ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించాయి. ఈ ఎన్నికల్లో మున్నెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 22 మంది పంజాబీ మూలాలను కలిగిన అభ్యర్థులు విజయఢంకా మోగించి ప్రతిష్టాత్మక హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికయ్యారు. ఇది కెనడా పార్లమెంటులోని మొత్తం స్థానాల్లో 6 శాతానికి పైగా కావడం గమనార్హం. ఈ ఫలితాలు కెనడా రాజకీయాలపై పంజాబీ డయాస్పోరా పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి.పంజాబీలు అధికంగా నివసించే బ్రాంప్టన్ నగరంలో ఎన్నికల ఫలితాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో పంజాబీ పేర్లతో ఉన్న అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు. లిబరల్ పార్టీకి చెందిన రూబీ సహోతా బ్రాంప్టన్ నార్త్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అమన్‌దీప్ జడ్జ్‌పై గెలుపొందారు. అదేవిధంగా బ్రాంప్టన్ ఈస్ట్‌లో లిబరల్ పార్టీ నేత మణిందర్ సిద్ధూ, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బాబ్ దోసాంజ్‌ను ఓడించారు. అయితే, బ్రాంప్టన్ సౌత్‌లో ఫలితం భిన్నంగా వచ్చింది. ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి సుఖ్‌దీప్ కాంగ్, సిట్టింగ్ లిబరల్ ఎంపీ సోనియా సిద్ధూపై విజయం సాధించారు.
కెనడా ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన పంజాబీలు..
- Advertisement -
RELATED ARTICLES