Monday, September 15, 2025
E-PAPER
Homeజాతీయంఫ్రాన్స్‌ నుంచి114 రఫేల్‌ విమానాల కొనుగోలు

ఫ్రాన్స్‌ నుంచి114 రఫేల్‌ విమానాల కొనుగోలు

- Advertisement -

రక్షణ శాఖకు ఐఏఎఫ్‌ ప్రతిపాదన
న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ నుంచి 114 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం యోచిస్తోంది. మధ్య శ్రేణి బహుళ ప్రయోజక యుద్ధ విమానాల (ఎంఎంఆర్‌సీఏ) ఒప్పందంలో భాగంగా డస్సాల్ట్‌ ఏవియేషన్‌ నుంచి 126 రఫేల్‌ విమానాలను కొనుగోలు చేయాలని గతంలో వైమానిక దళం భావించింది. అయితే కేవలం 36 విమానాలను మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు తాజాగా అదే సంస్థ నుంచి 114 విమానాల కొనుగోలుకు సిద్ధపడింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. వివిధ విభాగాల నుంచి అత్యవసర అనుమతులు పొంది డస్సాల్ట్‌తో చర్చలు ప్రారంభించాలని వైమానిక దళం సూచించింది. రెండు లక్షల కోట్ల రూపాయల అంచనాతో దేశీయ విక్రేత భాగస్వామ్యంతో రఫేల్‌ విమానాలను స్థానికంగా తయారు చేయాలన్నది వైమానిక దళం ప్రతిపాదన. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తే రఫేల్‌లో ఎం88 ఇంజిన్‌ సహా 60 శాతం వరకూ దేశీయ పరికరాలే ఉంటాయి. డస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ ఎం88 పవర్‌పాక్స్‌ కోసం హైదరాబాదులో నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది వచ్చే సంవత్సరం చివరి నాటికి పని చేయడం ప్రారంభిస్తుంది. 2029-30లో డెలివరీలు పూర్తయిన తర్వాత విమానాలు వైమానిక, నౌకా దళాలకు సేవలు అందిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -