నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలోని పది మండలాల పరిధిలో తడిసినటువంటి వరి ధాన్యం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు. రైతులు స్వయంగా ఆ ధాన్యాన్ని కొంతమేరకు ఆరబెట్టినప్పటికీ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు సుమారు 2,653 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, ఆ ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను టాబ్ ఎంట్రీల ద్వారా నమోదు చేసి, వారికి రావలసిన మొత్తం డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడిందన్నారు.రైతులు అధైర్యపడవద్దని జిల్లా యంత్రాంగం భరోసా ఇస్తోందని, రైతులు తమ పంటను సరైన విధంగా ఆరబెట్టి, తగిన తేమ శాతం వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాలకు తరలించాలనీ కోరారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వాహకులకు తగు సూచనలు ఇస్తున్నారని. తనతో పాటు అదనపు కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేయడంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.
తడిసినటువంటి వరి ధాన్యం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


