Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి 

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి 

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య 
నవతెలంగాణ-మర్రిగూడ
ఖరీఫ్ సీజన్ లో పండిన పత్తి,వరి పంటలను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. బుధవారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) మండల పార్టీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో జాప్యం వలన మండలంలోని ఆయా గ్రామాలలో దళారుల దందా జోరుగా కొనసాగుతుందని, అమాయకమైన రైతులను మభ్యపెట్టి క్వింటా పత్తి ప్రభుత్వ మద్దతు ధర 8100 ఉండగా.. దళారులు 5000-6000 లకు కొనుగోలు చేస్తున్నారని, కొలతల్లో కూడా తేడాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే ఆలస్యం చేయకుండా మండలంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పత్తి, వరి పంటలను కొనుగోలు చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని, సన్న వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 500 రూపాయల బోనస్ చెల్లించాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  మండల కమిటీ సభ్యులు సల్వుజు రామలింగాచారి, ఏరుకొండ రాఘవేంద్ర, ఐతపాక యాదయ్య, మేతరి నరసింహ, ఇరగ దిండ్లరాజు, అయిత పాక్ లచ్చయ్య, అయితపాక జంగయ్య, షేగోజు ఈశ్వర చారి, నూకల రాములు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -