జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: రానున్న వానాకాలం సీజన్ కొరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు, తార్పాలిన్ల అవసరాన్ని అంచనా వేయాలని, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రోజు తన ఛాంబర్ లో అధికారులతో మాట్లడుతూ అవసరాలకు అనుగుణంగా స్పెసిఫికేషన్లను ఖరారు చేయడం కొరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడం కోసం ఒక జిల్లా కొనుగోలు కమిటీ ఏర్పాటు చేయబడిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులు గా ఉన్న రెవిన్యూ అదనపు కలెక్టర్– చైర్మన్ ,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా సహకార అధికారి,జిల్లా వ్యవసాయ అధికారి ,జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ ప్యాడీ క్లీనర్లు, తార్పాలిన్లు అవసరమైన పీపీసీలను గుర్తించి, ముందస్తు కొనుగోళ్లు జరిపి రానున్న సీజన్ లో కొనుగోళ్ల ప్రక్రియకు సమాయత్తం చేస్తుందనారు.
ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,జిల్లా పౌర సరఫరా అధికారి హరి కృష్ణా,జిల్లా సివిల్ సప్లై అధికారి రోజా రాణి, మార్కెటింగ్ అధికారి సబితా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.