Sunday, April 12, 2026
E-PAPER
Homeసినిమాపక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

వెంకట్‌ హీరోగా విఆర్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న మాస్‌ కమర్శియల్‌ ఎంటర్‌ టైనర్‌ ‘హరుడు’. రాజ్‌ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్‌ స్పెషల్‌గా మే 8న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌ రిలీజ్‌ కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. హీరో వెంకట్‌ మాట్లాడుతూ,’ ఈ సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్‌తో పాటు ప్రొడ్యూసర్‌ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. చాలా మంచి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో విలన్‌గా శ్రీహరి పైలా అనే కొత్త ఆర్టిస్ట్‌ను పరిచయం చేస్తున్నాం. దర్శకుడు రాజ్‌ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు. ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను గోవాలో షూట్‌ చేశాం. ఆ పాట చాలా బాగా వచ్చింది. రిలీజ్‌ తర్వాత అది ఇంకా హిట్‌ అవుతుంది. హైదరాబాద్‌ మాస్‌ సాంగ్‌ కూడా చిత్రీకరించాం. అది థియేటర్లలో అలరిస్తుంది. మంచి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయి. గోవా, ముంబైలో పాటలు చిత్రీకరించాం. మంచి బడ్జెట్‌తో, మంచి లొకేషన్స్‌లో సాంగ్స్‌ తీశాం. మా డిఓపీ ఆనంద్‌ చాలా సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నన్ను యాక్షన్‌ హీరోలా చూపించారు. ఇది మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌’ అని తెలిపారు. ‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని డైరెక్టర్‌ రాజ్‌ తాళ్లూరి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -