Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం 

చైత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-నకిరేకల్ : శాలిగౌరారం మండలంలోని ఇటుకుల పహాడ్ గ్రామానికి చెందిన చైత్ర ఫౌండేషన్ చైర్మన్ యంగలి రామకృష్ణ గౌడ్ తన స్వగ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ ను గ్రామపంచాయతీకి అప్పగించినట్లు తెలిపారు. గతంలో కూడా డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ను, గ్రామం లోని పాఠశాలలకు గేమ్స్ మెటీరియల్ తో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉన్న ఊరును కన్న తల్లీ గా భావించి తాను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మున్ముందు ఎన్నో ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి అల్లి సైదులు, వివిధ పార్టీల నాయకులు అక్కినపల్లి శ్రీనివాస్, శ్రీరాములు, శేషరాజు పల్లి రామచంద్రు, చివుట సైదులు, కాంచాని నాగరాజు, రేపాని రాజు, దండంపెల్లి శ్రీనివాస్, శీలం యాదగిరి, నారగోని వీరయ్య, ఇంద్రకంటి శ్రీనివాస్, శీలం వీరయ్య, సూర దుర్గయ్య, అంబటి రమేష్, గ్రామ పంచాయితీ సిబ్బంది  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -