Saturday, October 4, 2025
E-PAPER
Homeసినిమా'పురుష:' చిత్రీకరణ పూర్తి

‘పురుష:’ చిత్రీకరణ పూర్తి

- Advertisement -

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కంటెంట్‌లో హాస్య భరితమైన చిత్రాలు ఎవర్‌ గ్రీన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీతో పాటు, సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రాలు అయితే ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ డిఫరెంట్‌ కామెడీ మూవీని కళ్యాణ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద బత్తుల కోటేశ్వరరావు ఆడియెన్స్‌కు అందించనున్నారు అని చిత్ర బృందం తెలిపింది. పవన్‌ కళ్యాణ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ‘పురుష:’ అనే సినిమాను బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు ‘మళ్లీ రావా, జెర్సీ, మసూద’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు.

ఈ కామెడీ బేస్డ్‌ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్‌, వి.టి.వి.గణేష్‌, అనంత శ్రీరామ్‌, పమ్మి సాయి, మిర్చి కిరణ్‌ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్టైన్మెంట్‌ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్‌, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషిం చారు. తాజాగా ఓ ప్రత్యేక గీతంతో చిత్రీకరణకు గుమ్మడి కాయ కొట్టేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా మేకర్స్‌ ప్రారంభించారు. కొత్త హీరో అయినప్పటికీ తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడని యూనిట్‌ చెబుతోంది. నిర్మాతకు మొదటి ప్రాజెక్ట్‌ అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -