Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'పుష్ప 3' కచ్చితంగా ఉంటుంది

‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుంది

- Advertisement -

‘సైమా-2025’ అవార్డుల వేడుకలో దర్శకుడు సుకుమార్‌

సంచలన విజయాలు సాధించిన ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘పుష్ప 3’ ఉంటుందని సైమా-2025 అవార్డుల ప్రదానోత్సవ వేదికపై దర్శకుడు సుకుమార్‌ స్పష్టం చేశారు. దీంతో గత కొంత కాలంగా అందరిలో ‘పుష్ప3’పై ఉన్న సందేహాలన్ని క్లియర్‌ అయ్యాయి.
ప్రతిష్ఠాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2025 వేడుకలు దుబారులో ఘనంగా జరుగుతున్నాయి. దుబారు ఎగ్జిబిషన్‌ సెంటర్‌, ఎక్స్‌పో సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు తెలుగు చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు.
‘సైమా’ 2025 అవార్డ్‌ విజేతలు (తెలుగు)
ఉత్తమ చిత్రం : కల్కి, ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) : ప్రశాంత్‌ వర్మ, ఉత్తమ నటుడు : అల్లు అర్జున్‌, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : తేజ సజ్జా, ఉత్తమ నటి : రష్మిక మందన్నా, ఉత్తమ నటి (క్రిటిక్స్‌) : మీనాక్షి చౌదరి, ఉత్తమ సహాయ నటుడు : అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి), ఉత్తమ సహాయ నటి : అన్నే బెన్‌, ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్‌, ఉత్తమ గీత రచయిత : రామ జోగయ్య శాస్త్రి, ఉత్తమ గాయకుడు : శంకర్‌ బాబు, ఉత్తమ గాయని : శిల్పా రావు, ఉత్తమ ప్రతినాయకుడు : కమల్‌ హాసన్‌, ఉత్తమ పరిచయ నటి : పంకూరి, భాగ్యశ్రీ బోర్స్‌, ఉత్తమ పరిచయ నటుడు : సందీప్‌ సరోజ్‌, ఉత్తమ పరిచయ దర్శకుడు : నంద కిషోర్‌ యేమని, ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు, ఉత్తమ హాస్యనటుడు : సత్య.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad