- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఆలయ వసతి గదుల్లో కొండచిలువ కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురైన ఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బుధవారం చోటుచేసుకుంది. వెంటనే గమనించిన ఆలయ కమిటీ సభ్యులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. గంటసేపు శ్రమించి కొండచిలువను పట్టుకోవడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ ఎల్పుల మహేష్ తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తుంటారు. కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -