Monday, February 23, 2026
E-PAPER
Homeఆటలుఖతార్‌ విజేత అల్కరాస్‌

ఖతార్‌ విజేత అల్కరాస్‌

- Advertisement -

దోహా : వరల్డ్‌ నం.1, స్పెయిన్‌ యంగ్‌బుల్‌ కార్లోస్‌ అల్కరాస్‌ ఖతార్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌ ఆటగాడు అర్ధర్‌ ఫిల్స్‌పై 6-2, 6-1తో వరుస సెట్లలో అల్కరాస్‌ గెలుపొందాడు. ఐదు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన అల్కరాస్‌ 50 నిమిషాల్లోనే లాంఛనం ముగించాడు. పాయింట్ల పరంగా 52-24తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన అల్కరాస్‌.. అర్థర్‌ను చిత్తుగా ఓడించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌తో కెరీర్‌ స్లామ్‌ సాధించిన అల్కరాస్‌.. అదే జోరు దోహాలో కొనసాగించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -