ఇక చిల్లర కష్టాలకు చెక్..
నవతెలంగాణ – అచ్చంపేట
ఆర్టీసీ బస్సులలో టిక్కెట్ కు సరిపోను నగదు ప్రయాణికులు ఇవ్వకపోవడంతో చిల్లర ద్వారా కండక్టర్ లు ఇబ్బందులు పడ్డారు. టిక్కెట్టు వెనకాల చిల్లర డబ్బులు రాసి ఇచ్చేవారు. దిగేటప్పుడు తీసుకొని ప్రయాణికులకు కండక్టర్లు చెప్పేవారు. మర్చిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి టికెట్ కు సరిపోను డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే, ఇతర ఆన్లైన్ ద్వారా చెల్లించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా పల్లె వెలుగు నుంచి డీలక్స్ ఆర్టీసీ బస్సులలో క్యూఆర్ కొడ్ తో నగదు రహిత టికెట్ కొనుగోలు చేయవచ్చు. చిల్లర కష్టాలకు చెల్లుబాటు అయ్యింది. దీని ద్వారా ఇటు ప్రయాణికులు అటు కండక్టర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులలో క్యూఆర్ కోడ్ సేవలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



