Tuesday, May 6, 2025
Homeఖమ్మంఅవగాహన సాగుతో నాణ్యమైన, అధిక దిగుబడులు….

అవగాహన సాగుతో నాణ్యమైన, అధిక దిగుబడులు….

- Advertisement -

సాంకేతిక పరిజ్ఞానంతో సులువైన యాజమాన్యం పద్దతులు…
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రారంభం కార్యక్రమంలో పలువురు వక్తల ప్రసంగాలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: వ్యవసాయంపై అవగాహనతో కూడిన పంటల సాగులో నాణ్యమైన ఉత్పత్తులను,అధిక దిగుబడులు సునాయాసంగా సాధించవచ్చునని అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ  విశ్వవిద్యాలయం సహాకారంతో స్థానిక వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఆరు వారాలు పాటు నిర్వహించనున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రారంభ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత కుమార్ అద్యక్షతన జరిగిన సభలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు,వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత్ కుమార్,వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవికుమార్,పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు,మండల పరిషత్ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్,ఆయిల్ ఫాం గ్రోయర్స్ సొసైటీ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య లు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
అనంతరం సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలను రైతు పొలాల్లోకి తీసుకుని వెళ్లటానికి,రైతులను శాస్త్రవేత్తలతో మమేకం చేయటానికి రైతు “ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే ఈ బృహత్ కార్యాన్ని చేపట్టడం,శాస్త్రవేత్తలు తెలియజేసి,మేలైన యాజమాన్య పద్ధతులు రైతులు చేపట్టినట్లయితే సాగు ఖర్చులను తగ్గించుకొని సుస్థిరమైన దిగుబడులను సాధించవచ్చు అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబురావు మాట్లాడుతూ రైతు సోదరులు విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులు భద్రపరచుకుని,ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు అన్నారు.రైతులు తమకు కావలసిన విత్తనాలు,రసాయనాలు కొనుగోలు చేసేటప్పుడు,తమ పంట ఉత్పత్తులను అమ్మే టప్పుడు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. రైతు సోదరులు ఏళ్ల తరబడి ఒకే పంట వేయకుండా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి అన్నారు.పంట మార్పిడి వల్ల భూసారం పెరిగి చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది అన్నారు. 
వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే. హేమంత కుమార్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన మేర ఎరువులను వాడాలి అదే విధంగా యూరియాను భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా తగిన మోతాదులో దఫాలుగా కొద్దికొద్దిగా వేసుకోవడం ద్వారా పంట ఏపుగా పెరిగి నాణ్యమైన టు వంటి దిగుబడులను రావటంతో పాటు,చీడపీడల ఉధృతి కూడా తగ్గి తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు అన్నారు.అదేవిధంగా అవసరమైనటువంటి మేర మాత్రమే రసాయనాలను వాడటం ద్వారా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. ఏ డి ఏ రవికుమార్ మాట్లాడుతూ సాగు వీటిని ఆదా చేసుకునేటువంటి మార్గాలను రైతులకు వివరించారు.సాగునీరు,నేల కాపాడుకుంటేనే భావితరాల భవిష్యత్తు బంగారం ఏమవుతుంది అన్నారు.
ఆయిల్ ఫామ్ ఎఫ్.పీ.ఓ బాధ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఈ వినూతన  కార్యక్రమం చేపట్టటం నిజంగా అభినందనీయమని అన్నారు. రానున్న కాలంలో శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయడానికి మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ వారు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.ఏ డి హెచ్ డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ పశు పోషణ పై రైతులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నారు.పశు పోషణ ద్వారా పాలు మరియు పాల ఉత్పత్తులతో పాటు పంట భూములకు కావలసిన, సేంద్రియ పదార్థం కూడా లభిస్తుంది అన్నారు.సేంద్రియ పదార్థాన్ని వాడటం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వీ.ఎస్ రెడ్డి మాట్లాడుతూ చెట్ల పెంపకం ద్వారా కలిగే ప్రయోజనాలను అదేవిధంగా ఆయిల్ ఫామ్ తోటల సాగులో పాటించాల్సినటువంటి మెలకువలును గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల,శాస్త్రవేత్తలు కే. నాగాంజలి,ఎం.రాంప్రసాద్, ఎస్. మధుసూదన్ రెడ్డి,ఆర్. శ్రావణ్ కుమార్,టీ. పావని, నీలిమ,పి. శ్రీలత,కే. కోటేశ్వర్, కృష్ణ తేజ, ఆర్. రమేష్, ఝాన్సీ,అశ్వారావుపేట రైతు సోదరులు మరియు వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -