Friday, October 31, 2025
E-PAPER
Homeజిల్లాలుకేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్య: జీసీడీఓ భాగ్యలక్ష్మి

కేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్య: జీసీడీఓ భాగ్యలక్ష్మి

- Advertisement -

నవతెలంగాణ-ఏర్గట్ల: కేజీబీవీల ద్వారా బాలికలకు నాణ్యమైన విద్య అందుతుందని జీసీడీఓ భాగ్యలక్ష్మి అన్నారు. గురువారం ఏర్గట్ల కేజీబీవీ పాఠశాల ఆమె సందర్శించారు. పాఠశాలలోని వంట గదిని, విద్యార్థుల కోసం ఉపయోగించే వంట సరుకులను, ఉపాధ్యాయినులు రిజిస్టర్, పాఠశాల చుట్టూ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. అనంతరం తరగతి గదులలోకి వెళ్ళి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుని, వారికి సలహాలు, సూచనలు అందజేశారు. ఇందులో భాగంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి, ఉపాద్యాయినులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -