Saturday, May 17, 2025
Homeజిల్లాలుప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య 

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పెద్దగుండవెల్లి కాంప్లెక్స్ హెచ్ఎం బండి నర్సవ్వ అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సాధన, ఎంపీపీఎస్ హెచ్ఎం నిమ్మ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు స్కూల్ల మాయలో పడవద్దని, ప్రభుత్వ బడుల్లోనే సంస్కారమంతమైన విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -