ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..

– తాడిచెర్ల హైస్కూల్ హెడ్ మాస్టర్ మల్కా భాస్కర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని  మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం బడిబాట కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ 5వ తరగతి పూర్తి చేసిన 52 మంది విద్యార్థులను 6వ తరగతిలో అడ్మిషన్లు చేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు,నోట్ బుక్స్,యూనిపామ్స్, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. బడిడు పిల్లలను చేర్పించాలని ర్యాలీలు,కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు  పాల్గొన్నారు.
Spread the love