Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
పాఠశాల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రామంచ ఉపాధ్యాయులు చేస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని మండల విద్యాశాఖ అధికారి తిరుపతి అన్నారు. మంగళవారం మండలంలోనీ  రామంచ  ప్రాథమిక పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య తోపాటు  పాఠశాల సౌజన్యంతో సమకూర్చిన 18 వేల స్పోర్ట్స్ డ్రెస్సులను 40 మంది విద్యార్థులకు  పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామంచ పాఠశాల మండలంలో విద్యార్థుల సంఖ్య పరంగా మూడవ స్థానంలో ఉందని, సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమన్నారు. 

పాఠశాలలో విద్య తో పాటు, ప్రత్యేక కార్యక్రమాలను  చేపట్టారన్నారు.  పాఠశాలకు తల్లిదండ్రుల సహకారం బాగుందన్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం డబ్బులు, ఆస్తులు సంపాదించాలి అనుకుంటారు. ముఖ్యం కాదని  పిల్లలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేలా మంచి విద్యను అందించాలన్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందిస్తున్న చేయూతనుసద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు వై.వి.సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం అబ్దుల్లా షరీఫ్,  ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ప్రేమలత, ఉపాధ్యాయులు సునీత, నాగమణి, వరప్రసాద్, యాదయ్య, స్వరూప, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -