Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి

ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం ఎదుట దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా,, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  76వ జయంతి సందర్భముగా  యూత్ కాంగ్రెస్ నాయకులు పెండెం శ్రీకాంత  ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కి ఘన నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  విచ్చేసి వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులు అర్పించారు.

ఈ సందర్భముగా వెంకటకృష్ణ  మాట్లాడుతూ మహానేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్  రాష్ట్ర సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అమోఘం అని అన్నారు. ఆయన సీఎంగా ఉన్న రోజులు ఆయన రూపొందించిన పథకాలు దేశానికే దిక్సూచీల మారాయని, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకం, రైతులకు ఏక కాలంలో పంట రుణమాఫీ, 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజ్ రీ-ఇంబార్సుమెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్యను అందించడం, అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇందిర జల ప్రభ ద్వారా పేదలకు బోర్లు వేయించడం లాంటి అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచి, దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందాడని కొనియాడారు.

ఆయన వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక బద్దంగా చేసిన ప్రతి ఒక్క పథకం విజయవంతం అయి పేదల పాలిట పెన్నిధి వై.ఎస్.ఆర్.  అయ్యారని అన్నారు. ఇవ్వాళ మహానేత వై.ఎస్.ఆర్. గారి 75వ జయంతి సందర్భముగా వారికి మా ఘన నివాలులు అర్పిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి తో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad