– బషీరాబాద్ సర్పంచ్ జమున మహేష్
– అంగన్వాడి కేంద్రాల పరిశీలిలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలకు, గర్భవతులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని బషీరాబాద్ సర్పంచ్ బైకాన్ జమున మహేష్ అన్నారు. సోమవారం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను సర్పంచ్ జమున మహేష్ పరిశీలించారు. మొత్తం 5 అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న సమస్యలను ఆయా కేంద్రాల అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు.4 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతునాయని టీచర్ లు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను అధికారులకు తెలియజేస్తానని సర్పంచ్ తెలిపారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భవతులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను పర్శీలించారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా అంగన్వాడీ టీచర్ లు కృషి చేయాలని కోరారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.



