– కామారెడ్డికి సంబంధించిన మొదటి కేసు విజయవంతంగా నిర్వహించాము
– యశోద హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి
తక్కువ ఖర్చుతో ఎక్కువ బాధ లేకుండా తొందరగా తన పనులు తాను చేసుకునే విధంగా వ్యాధిని నయ చేయడం జరిగిందని కామారెడ్డికి సంబంధించిన మొదటి కేసులో విజయం సాధించినట్లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సికింద్రాబాద్ క్లినిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన సుమలత అనే ఉపాధ్యాయురాలకు రక్తనాళాల వ్యాధి తో నడుము నొప్పి రాగా ఆ వ్యాధిని ఇంజక్షన్ ద్వారా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సికింద్రాబాద్ క్లినిక్ సెంటర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా చికిత్స జరగని సుమలతకు ఆ నడుము నొప్పి వ్యాధి నయం కాలేదని తమ ఆసుపత్రికి రాగా తమ ఆసుపత్రిలో వ్యాధిని గుర్తించి మెరుగైన వైద్యం అందించి నాలుగు రోజులలో యధావిధిగా ఆమె విధులు ఆమె నిర్వహించుకునే విధంగా చేయడం జరిగిందన్నారు.
ఇది ముఖ్యంగా రక్తనాళాల్లో చీలిక ఏర్పడినప్పుడు ఈ నడుము నొప్పి వ్యాధి రావడం జరుగుతుందన్నారు. దీనిని మొదట్లోనే గుర్తిస్తే పెద్దగా ఖర్చు లేకుండానే మందుల ద్వారా నయం చేయడం జరుగుతుందని, రోగులు వ్యాధిని గుర్తించే విషయంపై జాగ్రత్తలు వహించాలన్నారు. తాను గత 20 సంవత్సరాలుగా బెంగళూరులో వైద్యం చేయడం జరిగిందని గత ఆరు నెలలుగా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా నిలబడి ఉండడం, ఎక్కువగా కూర్చుని విధులు నిర్వహించే వారికి ఈ వెన్నుపూస వ్యాధి రావడం జరుగుతుందని, దీనిని మొదట్లో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే తెల్ల కణాలలో ఏర్పడిన చిలుక కింది వరకు వచ్చి కాళ్లు పడిపోయే ( పక్షవాతం ) అవకాశం ఉంటుందని, అంతేకాకుండా కాళ్లకు నల్లటి మచ్చలు పుండ్లు అయ్యే అవకాశం ఉంటాయన్నారు. ప్రతి నెల కామారెడ్డిలో రెండవ బుధవారం అందుబాటులో ఉండడం జరుగుతుందన్నారు.
వైద్యం చేయించుకున్న సుమలత మాట్లాడుతూ..ఈ వ్యాధి అర్థంకాక వెన్నుపూస రావడంతో కిడ్నీ డాక్టర్ను, హాట్ డాక్టర్ను నాలుగు రకాల డాక్టర్లను కలిసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆ తర్వాత నాలుగు నెలల క్రితం సికింద్రాబాద్ లోని ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని అక్కడ తనకు ఇంజక్షన్ ద్వారా వ్యాధి నిర్ణయం చేయడం జరిగిందన్నారు. ఈ వ్యాధి నయం కావడానికి వేరే ఆసుపత్రిలో ఖర్చు 7 లక్షలకు పైగా చెప్పారని, ఈ యశోద ఆసుపత్రిలో ఈ ఇంజక్షన్ ద్వారా నాలుగు లక్షల లోనే పూర్తిగా వ్యాధినియమైందన్నారు. నాలుగు రోజులలో యధావిధిగా నా పనులు నేను చేసుకుంటున్నాను అన్నారు. యశోద ఆసుపత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు.