నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండల కేంద్రంలో “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” కార్యక్రమంలో భాగంగా వరి విత్తన క్షేత్రాలలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ ఆధ్వర్యంలో రైతు శ్రీ పోషి రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ శాస్త్రవేత్తల బృందం రైతులకు వరి రకం WGL- 962 గుణగణాల గురించి వివరించారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ… అధిక దిగుబనిచ్చే వరి రకమును రైతుల నుండి తోటి రైతులకు నాణ్యమైన విత్తనాలుగా అందించాలని కోరారు. తోటి రైతులు కూడా ఈ రకం చాలా అనుకూలంగా ఉందని, చీడ పీడలు తట్టుకుని మంచి దిగుబడి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ఈ రకం యొక్క గుణగణాలు చూసి హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు డా. హరి , డా. వెంకట రాజకుమార్ , డా. ఓం ప్రకాష్ , డా. ప్రశాంత్ , శ్రీమతి. ఏ ఈ ఓ శ్రీ. రాజన్న, అభ్యుదయ రైతులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



