Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి..

 నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి..

- Advertisement -

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు..
భువనగిరి మండల వ్యవసాయ శాఖ అధికారి డి మల్లేష్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: విత్తనాల డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు అందితే కఠిన చర్యలు తప్పవని  భువనగిరి మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కోరారు. శుక్రవారం ఆయన మండలంలోని ప్రయివేటు,  టిఎస్పిఎస్సి ఎరువులు,  విత్తనాల  షాపులను తనిఖీ చేసి మాట్లాడారు. విత్తనాల డీలర్లు తప్పకుండా విత్తన చట్టాలకు లోబడి అమ్మకాలు జరపాలని నిషేధిత విత్తనాలను గాని ఎరువులు పురుగుమందులు గాని అమ్మినట్లయితే  విత్తన చట్టం ప్రకారం,  ఎరువుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని, రైతులు రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పచ్చి రొట్టె విత్తనాలైనా జీలుగా,జనుము ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భువనగిరి నందు 50 క్వింటాల్లో జీలుగా , ఐదు క్వింటాల జనుము 50% సబ్సిడీ మీద పంపిణీ చేయడం జరుగుతుందనారు.   రైతులు తమ యొక్క ఆధార్ , పటదారి పాసుబుక్కు తీసుకొచ్చి సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేయగలరు జిల్లా తనిఖీ అధికారులుగా ఏడిఏ నీలిమ , బీబీనగర్ వ్యవసాయ అధికారి పద్మ,  తనిఖీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad