Wednesday, February 25, 2026
E-PAPER
Homeఖమ్మంమొక్కలు పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

మొక్కలు పెంపకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

- Advertisement -

– ఎప్పటి గెలలు అప్పుడే దిగుమతి చేసుకోవాలి
– పరిశ్రమల, నర్సరీ ల తనిఖీ లో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

నర్సీరీల్లో పెంచుతున్న పామాయిల్ మొక్కలు సస్యరక్షణ లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు పాటిస్తూ మొక్కలు పెంచాలని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నర్సరీ నిర్వాహకులు కు సూచించారు. ఆయన బుధవారం ఆయిల్ ఫెడ్ పరిశ్రమ, పామాయిల్ కేంద్రీయ నర్సరీలను తనిఖీలు చేసారు.

ఈ సందర్భంగా మొక్కలు నాణ్యత,పెరుగుదలను పరిశీలించారు.నర్సరీల్లో మురుగు నీరు లేకుండా చూడాలని,బిందు సేద్యం లేక తుంపర సేద్యంతో నీటి తడులు ఇవ్వాలని అన్నారు. పరిశ్రమ కు రైతులు తీసుకొచ్చిన గెలలు ను జాప్యం లేకుండా దిగుమతి చేసుకోవాలని తెలిపారు.

ఆయన వెంట జనరల్ మేనేజర్ టీ.సుధాకర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ సబావత్ శంకర్,అప్పారావు పేట, అశ్వారావుపేట పరిశ్రమ మేనేజర్ లు నాగబాబు,ఎంఎన్ కార్తీక్ లు ఉన్నవారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -