Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాణ్యమైన టెక్నికల్‌ విద్య : మంత్రి పొన్నం

నాణ్యమైన టెక్నికల్‌ విద్య : మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరింత నాణ్యమైన టెక్నికల్‌ విద్యను అందించడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంతో ఒప్పందానికి ఎంజేపి కసరత్తు చేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల సొసైటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సెక్రెటరీ బుద్దా ప్రకాష్‌ , వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌ , రాజేంద్ర నగర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జానయ్య, ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు పాల్గొన్నారు.

కరీంనగర్‌, వనపర్తిలలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ద్వితీయ, తృతీయ , చివరి సంవత్సరం విద్యార్థులకు వ్యవసాయ విశ్వ విద్యాలయ అధ్యాపకుల సమక్షంలో విద్యా బోధన చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగనున్న కరీంనగర్‌ ,వనపర్తి వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు, ఫీల్డ్‌ విజిట్‌, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌, రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, దాని అనుబంధ కళాశాలల్లోనే నిర్వహణ జరిగేలా కసరత్తు చేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -