Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇచ్చిన హామీలు మరిచిన పార్టీలను నిలదీయండి

ఇచ్చిన హామీలు మరిచిన పార్టీలను నిలదీయండి

- Advertisement -

నాగర్‌కర్నూల్‌లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్‌

నవతెలంగాణ మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మరిచిన బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలదీయాలని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎండగట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టీ.సాగర్‌ అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఆర్‌ శ్రీనివాసులు గెలుపు కోసం ప్రచారం చేశారు. అనంతరం జరిగిన సభలో సాగర్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి ఆర్‌ శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో పిలుపునిచ్చారు.

ఇక్కడ నుండి బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అవుతారని ప్రజలను నమ్మిస్తున్నారని, ఇప్పటివరకు ఈ వార్డు అభివృద్ధి కోసం చేసిన కృషి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ వేలు బడిలో కనీసం భూగర్భ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కేరళలో స్థానిక సంస్థల కోసం బడ్జెట్లోనే సగం నిధులు కేటాయించిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కుతుందన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో అభ్యర్థి ఆర్‌ శ్రీనివాసులు ,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు కందికొండ గీత, శంకర్‌ నాయక్‌ ,శివవర్మ ,యాదయ్య ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -