Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeప్రధాన వార్తలుక్విట్‌ ఇండియా స్ఫూర్తితో క్విట్‌ కార్పొరేట్‌ డే

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో క్విట్‌ కార్పొరేట్‌ డే

- Advertisement -

– కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల వ్యాఖ్య
– నారాయణగూడ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్‌ కార్పొరేట్‌ డేను నిర్వహిస్తున్నామని కేంద్ర కార్మిక సంఘాల, ఎస్‌కేఎం, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు చెప్పారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని నారాయగూడ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, బాలరాజ్‌గౌడ్‌, సాగర్‌, పద్మ మాట్లాడుతూ.. స్వాతంత్య్రోద్యమానికి ముందు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు సుమారు 200 ఏండ్లు మన దేశాన్ని పాలించి కార్మిక, రైతాంగ, సాధారణ ప్రజల్ని పీల్చి పిప్పి చేశారని, నాటి దుర్మార్గ విధానాలు, చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. నేటి బీజేపీ పాలకులు కూడా బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల మాదిరిగానే కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టేందుకు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయాలని చూస్తున్నదని తెలిపారు. మరోవైపు పాడి, మొక్కజొన్న, సోయా వంటి మొదలు వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి ద్వారాలు తెరవడం వల్ల మన దేశంలోని సన్న, చిన్నకారు రైతులకు నష్టదాయకమని నొక్కి చెప్పారు. బీజేపీ పాలకులు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలరాజ్‌, ఎస్‌. వీరయ్య, ఎస్వీ. రమ, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్‌, ఎం. పద్మశ్రీ, కూరపాటి రమేష్‌, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, సంయుక్త కిసాన్‌ మోర్చా కన్వీనర్లు టి.సాగర్‌, పశ్యపద్మ, మండలి వెంకన్న, నాగిరెడ్డి, అరుణప్రసాద్‌, రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం.శోభన్‌నాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, టీయూసీఐ రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌, ఎస్‌ఎల్‌.పద్మ, ఐఎఫ్‌టీయూ నేత అనురాధ, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఎ. సునీత, జె. కుమారస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బి.వెంకటేశం, కమతం యాదగిరి, బొడ్డుపల్లి కిషన్‌, సిహెచ్‌. జంగయ్య, అశోక్‌, మల్లేష్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad