నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో భాగంగా మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించినట్లు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు. ఉన్నత పాఠశాలల స్థాయిలో, ప్రాథమిక పాఠశాలల స్థాయిలో గణితం, సామాన్య శాస్త్రాలపై క్విజ్ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలలో ఉన్నత పాఠశాలల స్థాయిలో మొదటి బహుమతిని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సిహెచ్.మధుప్రియ గెలుపొందినట్లు ఆయన తెలిపారు.ద్వితీయ బహుమతిని కమ్మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీలాస్య, కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అభియాన్ గెలుచుకున్నట్లు తెలిపారు.
ప్రాథమిక పాఠశాలల స్థాయిలో మొదటి బహుమతి కోన సముందర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన జి.మహావీర్, ద్వితీయ బహుమతిని హాస కొత్తూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జి.సాధ్య శ్రీ గెలుపొందినట్లు ఎంఈఓ ఆంధ్రయ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మధుపాల్, రిసోర్స్ పర్సన్స్ శంకర్ గౌడ్, పసుపుల ప్రసాద్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మండల స్థాయిలో విద్యార్థులకు క్విజ్ పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES