గామా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శిరీష సమ ర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఆర్’. గోలి రామకష్ణ దర్శక నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాత. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రం సోమ వారం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
సంతోష్ కష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరంలోనే అక్టోబర్ 17వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.
దర్శక, నిర్మాత గోలి రామకష్ణ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని నటీనటుల సహకారంతో రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్ పూర్తి చేస్తాం. హైదరా బాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపు కునే ఈ సినిమా మంచి సందేశాత్మకమైన చిత్రంగా మీ ముందుకు రానుంది. ఓ మంచి సినిమాకి దర్శకత్వం వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
‘మా దర్శకునికి సినిమా పై ఉన్న మక్కువకు చిత్ర విడుదల తేదీ కూడా ఇప్పుడే వెల్లడించడం జరిగింది’ అని సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి చెప్పారు.
ఈ చిత్రానికి సమర్పణ : శిరీష, దర్శక నిర్మాత : గోలి రామకష్ణ, సహ నిర్మాత : గాలి బాల కిరణ్ రెడ్డి, డిఓపి: అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్ : మునీష్, కొరియోగ్రఫీ : శివాజీ.
సందేశాత్మకంగా ‘ఆర్’
- Advertisement -
- Advertisement -



