Thursday, October 2, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌లో రేసింగ్‌ లీగ్‌

హైదరాబాద్‌లో రేసింగ్‌ లీగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ఇండియన సూపర్‌ క్రాస్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఎస్‌ఆర్‌ఎల్‌) రెండో రౌండ్‌ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో ఐఎస్‌ఆర్‌ఎల్‌ పోస్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నందుకు ఐఎస్‌ఆర్‌ఎల్‌లోని ఎస్‌ఎక్స్‌ ఫ్రాంచైజీ యజమాని నేదురుమల్లి గౌతం రెడ్డిని జితేందర్‌ రెడ్డి అభినందించారు. ఈ పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని జితేందర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తొలి రౌండ్‌ పోటీలు వచ్చే అక్టోబరు 25,26న పుణెలో, రెండో రౌండ్‌ పోటీలు డిసెంబరు 6,7 తేదీల్లో హైదరాబాద్‌లో మూడో రౌండ్‌ పోటీలు డిసెంబరు 20,21లో కేరళలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్‌ సంఘం కోశాధికారి సతీష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -