సఖిగా ప్రేమను పొందినంత
సతి అయ్యాక పొందలేదనుకున్నాడేమో
రాధను వేణువుకు జత చేశాడు!!
చెలిగా చూపుల్లో బంధించినంత
నెచ్చెలి అయ్యాక బంధించలేదనుకున్నాడేమో
విల్లంబు విసురును సత్యభామ కొదిలేశాడు!!
అనువుగ ఊపిరితో వేణువు ఊదినంత
మనువయ్యాక మేనుతో సంద్రాన్ని ఈదలేని సుకుమారి అనుకున్నాడేమో
సంసార రథాన్ని కాస్తా రుక్మినమ్మ కొదిలేశాడు!!
వసంత ఋతువుగా బృందావనంలో ఊగినంత
జీవన ఋతువుగా బంధాలలో ఊగిస లాడించొద్దనుకున్నాడేమో
వైరాగ్య ఫలితాన్ని భగవద్గీతకు వ్యాపింప చేశాడు!!
ఇన్ని యుగాలుగా ప్రియసఖిని ఇష్టసఖిగానే ఉంచాలనుకున్నాడేమో
సతిగా చేసుకోక తన ప్రేమను మాత్రం రాధకే అంకితమిచ్చాడు!!
చివరకు ఎన్ని పేర్లున్నా రాధ పేరుతోనే తనని పిలవాలనుకున్నాడేమో
అందుకే కృష్ణుడు రాధకు ఇష్టుడయ్యాడు! రాధాకృష్ణుడయ్యాడు !!
– మృదుల, 7093470828
రాధాకృష్ణుడు
- Advertisement -
- Advertisement -